మహాదానందమైన నీదు సన్నిధి 04 Mahadhanandhamaina yesayya sannidhi
మహాదానందమైన నీదు సన్నిధి,
ఆపత్కాలమందు దాగు చోటది,
మానవులు అన్నియు,ఆలకించినా,
వినయము గల వారికి ఘనతయిచ్చినా,
నీ సింహాసనమును స్థాపించుటకు..,
నీవు కోరుకున్న సన్నిధానము, (2)
ఎంత మధురము నీ ప్రేమ మందిరం,
పరవసమే నాకు యేసయ్య, (2)
మహా…
1 . చరణం
విసిగిన హృదయం,కలవరమొంది,
వినయము కలిగి,నిన్ను చేరగా, (2)
పరమందుండి నీవు కరుణ చూపగ,
లేత చిగురు పైన మంచు కురుయురీతిగా, (2)
ప్రేమను చూపి,బహువు చాపి,
నీలో నన్ను, లీనము చేసిన, (2)
ప్రేమ సాగర,జీవితాంతము..,
నీ సన్నిధిని కాచుకొందును, (2)
మహా …
2 . చరణం
లెక్కించ లేని,స్థుతులతో నీవు,
శాశ్వత కాలము స్తుతి నొందెదవు, (2)
మహిమతో నీవు సంచరించగా, (ఆ..)
ఏడు దీప స్తంభమూలకు వెలుగు కలుగగా, (2)
ఉన్నతమైన ప్రత్యక్షతను,
నే చూచుటకు కృపనిచ్చితివి, (2)
కృపా సాగర,వధువు సంఘమై,
నీ కోసమే వేచియుందును, (2)
మహా ..
3 . చరణం
సియ్యెను శిఖరమే,నీ సింహాసనం,
శుద్ధులు నివసించు మహిమ నగరము, (2)
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, (ఆ..)
మధురముగా నీ యెదుట నేను పాడేదా, (2)
సౌందర్యముగా, అలంకరించిన,
నగరములోనే నివసించెదను, (2)
ప్రేమ పూర్ణుడా,మహిమాన్వితుడా,
నీతోనే రాజ్యమేలేదా, (2)
మహా ..